ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ‘దేవర-2’లో సర్పైజ్ పాత్రల ఎంట్రీ.. క్యూరియాసిటీ పెంచుతున్న న్యూస్

by Kavitha |
ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ‘దేవర-2’లో సర్పైజ్ పాత్రల ఎంట్రీ.. క్యూరియాసిటీ పెంచుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) గత ఏడాది ‘దేవర’(Devara) సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఈ ఇక ఈ మూవీతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ ‘దేవర-2’(Devara-2) పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముందు అనుకున్న కథలో చాలా మార్పులు చేసి కొత్త స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవర-2లోకి సర్పైజ్ పాత్రల ఎంట్రీ ఉండనుందని ఇన్‌సైడ్ వర్గాల టాక్. మరి వారు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఎందుకంటే ఫస్ట్ పార్టులో స్టోరీ అంత రసవత్తరంగా లేదు. దీంతో సెకండ్ పార్ట్ అయినా ఎలా ఉండనుందని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్(Kalyan Ram), యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని(Sudhakar Mikkilineni) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది.


Next Story

Most Viewed