అవన్నీ నా గుండెల్లో గుర్తుగా ఉంటాయి.. వదిలేయాలని అనుకోను మృణాల్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-04-12 06:48:15.0  )
అవన్నీ నా గుండెల్లో గుర్తుగా ఉంటాయి.. వదిలేయాలని అనుకోను మృణాల్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె సీత పాత్రలో చీరకట్టి సంప్రదాయ లుక్‌లో కనిపించి మెప్పించింది. ఇక అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తుంది. 2023లో మృణాల్ నటించిన హాయ్ నాన్న కూడా మంచి హిట్‌ను అందుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని థియేటర్స్‌లో కొనసాగతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యామిలీ స్టార్ పాత్ర గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నేను ఇందుగా ఉన్న క్షణాలు, ఇందు నేనుగా ఉన్న క్షణాలు. ఎవరు.. ఎవరో మీరు చెప్పగలరా? తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో గుర్తుగా ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయాలంటే, నేను ఇందుగా ఉండాలి. తన బూట్లు వేసుకోవడమే కాదు, వాటిలో ఒక మైలు నడవాలి. ఆమెను జీవితంలోకి తీసుకురావడం మొదట కొంచెం సవాలుగా ఉంది.

కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఒకసారి నేను దానిని గ్రహించాను. వెనక్కి తిరిగి చూసుకోలేదు.. నేను దాన్ని ఇంకా వదిలివేయాలని అనుకోను. నేను ఇందును.. ఆమె బూట్లు వేసుకుని నడవడాన్ని ఎంతగా ఆస్వాదించానో మీరు కూడా ఇందుని చూసి ఆనందించారని ఆశిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా కొన్ని ఫొటోలు వీడియోలు షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story