- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దసరా’ సినిమా షూటింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డా.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ‘దసరా’ సినిమా షూటింగ్ సమయాల్లో తను చాలా ఇబ్బంది పడ్డానని హీరోయిన్ పూర్ణ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన పూర్ణ.. ప్రస్తుతం పలు టీవీ షోలు చేస్తూ అలరిస్తుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ‘అఖండ’, ‘దసరా’ వంటి సినిమాల్లో మెరిసిన విషయం తెలిసిందే. దసరా మూవీలో విలన్‌కు భార్యగా చేసిన పూర్ణ.. అప్పుడు షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడిందంటా. ఈ మేరకు ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ ఈ విషయాలను అభిమానులతో పంచుకుంది.
‘దసరా’ సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భావతట. ఆ సమయంలో కొన్ని సీన్లు వర్షంలో చేయాల్సి వచ్చిందట. అది కూడా రాత్రి సమయంలో వర్షం పడుతున్నప్పుడు గర్భంతో ఉండటంతో షూటింగ్‌లో చాలా ఇబ్బంది పడిందట. చల్లటి నీళ్లు వాడాల్సి రావడంతో హెల్త్ పరంగా రెండు రోజులపాటు ఇబ్బంది ఎదుర్కొన్నారట. పైగా తన సీన్లు ఎక్కువగా రాత్రి సమయంలోనే ఉన్నాయని, చలిలో ఆయా సీన్లు చేయడం కష్టంగా అనిపించిందని చెప్పింది. అయినా అంత కష్టపడి చేస్తే తీరా ఎడిటింగ్‌లో తన సీన్లు కొన్ని తీసేశారని తెలిపిన పూర్ణ.. చేసిన కష్టం వేస్ట్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్ణ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read..
శ్రద్ధా శ్రీనాథ్ బర్త్ డే.. స్పెషల్ ట్రీట్ ఇచ్చిన ‘సైంధవ్’ టీమ్