నా భర్తతో విడాకులు తీసుకున్నా.. ఇప్పుడు నా కొడుకు రెండో పెళ్లి చేసుకో అంటున్నాడు: స్టార్ సింగర్

by Disha Web Desk 6 |
నా భర్తతో విడాకులు తీసుకున్నా.. ఇప్పుడు నా కొడుకు రెండో పెళ్లి చేసుకో అంటున్నాడు: స్టార్ సింగర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ కౌసల్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె 1999లో ‘నీకోసం’ సినిమాతో సింగర్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో యంగ్ హీరోల హిట్ చిత్రాల్లో పాటలు పాడి స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుని కొద్ది రోజులు రాణించింది. అలాగే హీరోయిన్ కల్యాణికి కొన్ని సినిమాల్లో డబ్బింగ్ చెప్పి తన గొంతుతో ఎంతో మందిని ఆకట్టుకుంది. సింగర్‌గా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేసి తన టాలెంట్స్‌తో కెరీర్‌లో మందడుగు వేసింది. అయితే కౌసల్య పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె ఓ కొడుకు పుట్టాక భర్తతో విడాకులు తీసుకుంది. కానీ దానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య విడాకులు తీసుకోవడానికి కారణాలు తెలుపుతూ సంచలన కామెంట్స్ చేసింది. ‘‘ నా భర్త ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉండేది కాదు. అతనితో పాటు ఆయన ఫ్యామిలీ వారు కూడా నన్ను చిత్రహింసలకు గురి చేసేవారు. అంతేకాకుండా నా భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని విడిపోయాను. నా కొడుకు బాధ్యత తీసుకుని పెంచి పెద్ద చేశాను. ప్రస్తుతం మా అబ్బాయి నన్ను ఒంటరిగా ఉండకుండా తోడుగా ఉండేందుకు రెండో పెళ్లి చేసుకోమని అంటున్నాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కౌసల్య కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.



Next Story

Most Viewed