పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్..

by Jakkula Mamatha |
పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్..
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఆదివారం రాత్రి నుంచి ఎన్నికల సంఘం పోలీసులకు సూచనలు చేసింది. పోలీసులు ఈ రోజు ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పల్నాడులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ స్పందించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది.

పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్సై ని సస్పెండ్ చేయాలని సూచించింది. అంతే కాదు సాయంత్రం 4-6 గంటల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగిన చర్యలు తీవ్రంగా ఉంటాయని ఈసీ హెచ్చరించింది. తెనాలిలో ఓటరుపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే శివకుమార్​పై చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులను మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అందజేశారు. ఉదయం నుంచి రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read More..

‘పవన్ కల్యాణ్ గెలిచాక రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తా’ (వీడియో)



Next Story