Dulqer Salman : ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రం ‘King Of kotha’ ..

by Dishaweb |   ( Updated:2023-08-21 15:38:16.0  )
Dulqer Salman : ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రం ‘King Of kotha’ ..
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. అభిలాష్ జోష్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‍గా నటించగా డ్యాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ ఫుల్ మాస్ యాక్షన్ సినిమా ఈ నెల ఆగస్టు 24న మలయాళం, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో హీరో దుల్కర్ జోరుగా అన్ని భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ తరుణంలో ఈ చిత్రానికి మరో ఘనత దక్కింది. ఈ మూవీ ట్రైలర్ అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వైర్‌ పై ప్లే అయింది. ఈ విషయాన్ని వేపారెర్ ఫిల్మ్స్ ప్రకటించింది. దీంతో టైమ్స్ స్క్వైర్‌పై ట్రైలర్ ప్లే అయిన తొలి మలయాళ చిత్రంగా ఈ ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఘనత దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి : సన్యాసి అనే గౌరవంతోనే Yogi Adityanand కాళ్లు మొక్కిన Rajni Kanth.. ఫ్యాన్స్ వైరల్ ట్వీట్స్..

Advertisement

Next Story