- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ramya Krishnan: రమ్యకృష్ణతో మూడు వరసల్లో.. నాన్న, అన్న, భర్తగా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీలో శివగామి పాత్రకు ప్రాణం పోసింది. కథానాయిక నుంచి విలన్ పాత్రలు వరకు నటించిన ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించింది. దాదాపు స్టార్ హీరోలను మొత్తాన్ని కవర్ చేసి ఇటు జూనియర్ హీరోలతో కూడా నటిస్తోంది. అయితే, రమ్యకృష్ణ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక మూవీలో రమ్యకృష్ణ అన్నయ్య పాత్ర చేసిన యాక్టర్ మరొక సినిమాలో అతనే రమ్యకృష్ణకి నాన్నగా కనిపించారు. ఆ తర్వాత మరొక మూవీలో అదే నటుడు రమ్యకృష్ణకి భర్త పాత్రలో నటించాడు. ఆయనెవరో కాదండీ.. బాహుబలిమూవీలో బిజ్జల దేవుడిగా కనిపించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళలో కూడా సినిమాలు చేస్తారు.
నాజర్, రమ్యకృష్ణ చాలా మూవీస్ లో నటించారు. నరసింహ మూవీలో రమ్యకృష్ణ నాజర్ చెల్లెలి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది తమిళ వెర్షన్ అయిన వంత రాజవతన్ వరువేన్ మూవీలో రమ్యకృష్ణ నాజర్ కూతురుగా మెరిసింది. ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి మూవీలో రమ్యకృష్ణ భర్త బిజ్జల దేవుడిగా నాజర్ కనిపించి అందర్ని అలరించారు.