Agent: ఏజెంట్ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?

by samatah |   ( Updated:2023-04-28 04:10:50.0  )
Agent: ఏజెంట్ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అఖిల్ ఏజెంట్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరక్కెకింది. ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.

ఏజెంట్ మూవీలో అఖిల్‌కు జంటగా సాక్షివైద్య నటించింది. అయితే ఈమెకు ఇదే మొదటి సినిమా. కాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ అమ్మడు, సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది, ఈ ఆఫర్ ఎలా వచ్చిందో తన అభిమానులకు తెలిపింది.

కాగా, ఇంటర్వ్యూలో సాక్షి వైద్య మాట్లాడుతూ..తాను సినిమాల్లోకి రాకముందు ఓ ఫిజియో థెరపిస్ట్ అని తెలిపింది. కరోనా సమయంలో ఖాళీగా ఉండటం వలన ఏం చేయాలో తెలియ రీల్స్ చేశాను. అవి వైరల్ కావడంతో ఆడిషన్స్ కి పిలిచారు. ఆ టైంలో కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆపాత్రలు నాకు నచ్చ వెళ్లలేదు. తర్వాత అఖిల్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

నాకు పరిచయం ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ అఖిల్ గురించి, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి చెప్పడంతో హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ లో ఓకే అయి హీరోయిన్ నేనే అని చెప్పాక అసలు నమ్మలేకపోయాను అని తెలిపింది.

Read more:

ఆ వీడియో లీక్ చేస్తానంటూ స్టార్ డైరెక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న రష్మిక..?

Advertisement

Next Story