- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శోభన్ బాబు నిజంగానే జయలలితను ప్రేమించడా.. ఆయన డైరీలో ఏం రాశారు?
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి టాలీవుడ్ అందగాడు అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు శోభన్ బాబు. ఆయన తన అందంతోనే కాకుండా నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అయితే శోభన్ బాబుకు సంబంధించిన అనేక రూమర్స్ అప్పట్లో వచ్చాయి. అందులో కొన్ని ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఒకటి,జయలలిత, శోభన్ బాబు ప్రేమ వ్యవహారం.
అయితే శోభన్ బాబు, జయలలిత ప్రేమించుకున్నారు అంటూ చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరు జంటగా తీసిన సినిమా డాక్టర్ బాబు అప్పటి నుంచే వీరు ప్రేమలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. కానీ వారిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని నిరూపిస్తుంది శోభన్ బాబు డైరీ. అసలు డైరీలో ఏముదంటే?
డాక్టర్ బాబు సినిమా షూటింగ్‌కు కొన్ని రోజుల ముదు జయలలిత తల్లి మరణించారంట. దీంతో శోభన్ బాబులో జయలలిత తన తల్లిని చూసుకుందంట. ఈ విషయాన్ని స్వయంగా హీరో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా, తన డైరీలో ఏం రాసుకున్నాడంటే?
బరువైన నా మనసును నీ జోకులతో తేలిక చేశావు..ప్రపంచం అంతా ఇప్పుడు నిశ్చలంగా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలని కలిసి ఉండాలని అనిపిస్తుందని జయలలిత తనతో చెప్పినట్టు శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారు. అంతే కాకుండా నా తల్లి మరణించి సంవత్సరం కూడా కాలేదు ఎన్నో సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది. నా అనుకన్నవాళ్లు నన్ను మోసం చేశారు.కానీ నువ్వు నాకు పరిచయం అయ్యాక ఆ బాధలన్నింటికీ విముక్తి దొరికిందని జయలలిత తనకు చెప్పినట్లు శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారు. దీంతో వారిద్దరు ప్రేమించుకోలే, మంచి స్నేహితులని తేలిపోయింది.
Also Read...
20 రోజులకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవర్ స్టార్.. ఏ సినిమాకో తెలుసా..!