BIGG BOSS వాయిస్ ఎవరిదో తెలుసా ?

by samatah |   ( Updated:2022-09-07 13:20:47.0  )
BIGG BOSS వాయిస్ ఎవరిదో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటుంది. సీజన్ మొదలైతే చాలు టీవీలు, ఫొన్స్ ముందు అతుక్కపోతారు. ఇప్పటికే 5 సీజన్లు కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మొదలైంది.

అలాగే బిగ్ బాస్ షోకంటే చాలా మంది బిగ్ బాస్ వాయిస్ ఇష్టం ఉంటుంది. బిగ్ బాస్ మీకు ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ.. ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది ఆ వాయిస్. ఇక చాలా మంది ఆ వాయిస్ ఎవరిది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వార్త. మనం రోజు టీవీలో వినే బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో కాదండి.. రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా, చేయకూడదన్న అన్ని బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన.

అయితే షో మొదలు పెట్టే సమయంలో బిగ్ బాస్ వాయిస్ కోసం చాలా మందిని తీసుకొని టెస్ట్ చేశారంట. కానీ ఎవరివాయిస్ సెట్ కాలేదంట. ఇక చివరకు రాధ కృష్ణ వాయిస్ టెస్ట్ చేయగా అతనిది సరిగ్గా సరిపోవడంతో అతన్నే ఫిక్స్ చేశారు. నిజం చెప్పాలంటే షోకు రాధాకృష్ణ వాయిస్ ఓవర్ బాగా హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు.

నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారా..?

Advertisement

Next Story