దానిని అక్రమ సంబంధం అంటారా ...రష్మి కామెంట్స్​ వైరల్​

by Sridhar Babu |   ( Updated:2023-06-28 08:51:35.0  )
దానిని అక్రమ సంబంధం అంటారా ...రష్మి కామెంట్స్​ వైరల్​
X

దిశ, వెబ్​డెస్క్​ : బుల్లితెరపై వచ్చీరాని తెలుగులో అందరినీ ఆకట్టుకునే యాంకర్​ రష్మికి సామాజిక స్పృహ కాస్త ఎక్కవనే చెప్పాలి. ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క మూగ జీవాలపైనే కాదు మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి నిత్యం స్పందిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఇలాంటిదే మరో విషయంలో స్పందించడమే కాదు ఓ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆమె సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. ఎక్కడో ఒకచోట పుష్పావతి అయిన ఓ 12 ఏళ్ల బాలికను తప్పుగా అర్థం చేసుకున్న ఆమె సోదరుడు హత్య చేశాడట. తన చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఉద్దేశంతోనే ఆమె అన్నయ్య ఆ బాలికను హత్య చేశారనే విషయంపై రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లికి పిరియడ్స్ రావడంతో అక్రమసంబంధం వల్లనే రక్తప్రావం అయిందని అపోహపడి ఆమెను కొట్టి చంపాడట.

దీనిపై రష్మీ ఎమోషనల్ అయ్యారు. సెక్స్​పై మినిమం అవగాహన లేకపోవడమే దీనికి కారణం అని ఆమె పేర్కొన్నారు. దీనిని అక్రమ సంబంధం అంటారా అని ప్రశ్నించారు. అందరికీ సెక్స్​ ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అలాగే ట్విట్టర్ వేదికగా రష్మి ఆ మధ్య కూడా ఓసారి స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి చేష్టలు ఏంటని ప్రశ్నించారు. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. అలా చేయడంపై ఆమె వారిని తప్పుపట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

Read More: స్త్రీల అందాన్ని కామం, సెక్స్‌తోనే ముడిపెడతారా.. నెటిజన్లపై కాజోల్ సీరియస్

Advertisement

Next Story

Most Viewed