షాకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న చూపులు కలిసిన శుభవేళ సీరియల్ నటి!

by Jakkula Samataha |
షాకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న చూపులు కలిసిన శుభవేళ సీరియల్ నటి!
X

దిశ, ఫీచర్స్ : చూపులు కలిసిన శుభ వేళ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఇది తెలుగు ప్రేక్షకుల మదిలోగూడుకట్టుకొని ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు.

ఇందులో నటించిన దల్జీత్ కౌర్ తన నటతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ నటికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దల్జీత్ ఇప్పటికే మొదటి భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల పాటు కుమారుడితో ఒంటరిగా ఉన్న ఈ నటి, తర్వాత దుబాయ్‌లో జరిగిన ఫ్రెండ్ పార్టీలో నిఖిల్ పటేల్‌తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడంతో, గతేడాది వీరు పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ నటి ఇప్పుడు తన రెండో భర్తతో కూడా విడాకులు తీసుకొని విడిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే తన కొడుకు జైడన్ తో తిరిగి ఇండియాకు వచ్చేసింది దల్జీత్. ఆ తర్వాత తన ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలను డెలీట్ చేసింది. అంతేకాకుండా ఆమె ఇన్ స్టా బయోలో ‘పటేల్’ ఇంటిపేరును కూడా తొలగించింది. అదే సమయంలో నిఖిల్ సైతం తన సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫోటోస్ డిలీట్ చేశాడు. దీంతో వీరు విడాకులు తీసుకొని విడిపోయారు అనే వార్తలకు మరింత బలం చేకూర్చారు. ఈక్రమంలోనే ఆమె ఇండియాలో ఉన్నాని, తన తండ్రికి సర్జరీ చేయాల్సి ఉన్నందున, ఆమె ఇప్పుడు తన కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం అంటూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story