- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాహుబలిలో అవంతికను నిజంగానే రేప్ చేశారా.. ఇన్నాళ్లకు నోరు విప్పిన రాజమౌళి
దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న గొప్ప వ్యక్తిగా చెప్తుంటారు. ఇంటిపేరే విజయంగా మార్చుకున్న ఈ అగ్ర డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలు ఏ ఒక్కటి కూడా అట్లర్ ఫ్లాప్ అయిన దాఖలు లేవు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల గురించైతే ఇక చెప్పాల్సిన అక్కర్లేదు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన చిత్రాలని చెప్పుకోవచ్చు. అయితే ఎంతటి ప్రముఖులైన పలు సందర్భాల్లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన జక్కన్న కూడా బాహుబలి చిత్రంలో ప్రభాస్-తమన్నా మధ్య తెరకెక్కించిన రొమాంటిక్ సీన్ల వల్ల దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నారు. రేప్ ఆఫ్ అవంతిక అంటూ అప్పట్లో ఓ మహిళా జర్నలిస్ట్ పెద్ద రచ్చ చేసిందని, కానీ అప్పుడు స్పందించలేదు.. అని దానిపై జక్కన్ల క్లారిటీ ఇచ్చారు.
రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి.. ‘‘శివుడు (ప్రభాస్) పాత్ర అవంతిక (తమన్నా భాటియా) వెంటపడే సన్నివేశంలో ఆమె మురికి బట్టల్ని తీసేయాలనే సీన్‌ను యాడ్ చేయడంతో హిందీ మీడియా దారణంగా తప్పు పట్టింది. అవంతిక రేప్‌కు గురైంది అన్నారు. ఆ సీన్‌పై చాలా విమర్శలు గుప్పించారు అవంతిక రేప్ కి గురైందంటూ విమర్శించారు. కానీ నేను ఆ ఉద్దేశంలో చిత్రీకరించలేదు. అవంతిక ఒక యోధురాలు. కాగా తను యోధురాలిగా ఉండాలని అనుకోదు. అందంగా కనిపించాలని అనుకుంటుంది. శివుడుకు బాణం తగిలినప్పుడు కూడా అవంతిక అందం గురించే యోచన చేస్తాడు. కాగా అవంతిక అందంగా ఉండాలని ఎంతగానో పరితపిస్తుందని తెలియజేయడానికే ఆ సన్నివేశాన్ని చూపించాం.
కానీ పలువురికి ఆ విషయం అర్థం కాక.. చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ సీన్ వల్ల కొంతమంది బాధపడ్డారు కూడా. నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. శివగామి, దేవసేన లాంటి బలమైన రోల్స్ ఉన్నప్పటికీ కొంతమంది మహిళలను నేను చూపించే విధానాన్ని విమర్శిస్తారు. కానీ దాని వెనుక ఉన్న స్టోరీని మాత్రం అర్థం చేసుకోరు’’ అంటూ రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.