Usha Parinayam: అందరిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.. 'ఉషా పరిణయం' సక్సెస్ మీట్‌లో డైరెక్టర్

by sudharani |
Usha Parinayam: అందరిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.. ఉషా పరిణయం సక్సెస్ మీట్‌లో డైరెక్టర్
X

దిశ, సినిమా: క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌ నిలిచే దర్శకుడు విజయభాస్కర్‌.కె. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ఉషా పరిణయం'. శ్రీకమల్‌, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్‌ మాట్లాడుతూ 'ఈతరం ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ జత చేసి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా రోజుల తరువాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా ఉంది. నువ్వు నాకు నచ్చావ్‌, నువ్వేకావాలి చిత్రాలతో ఈ చిత్రాన్ని పోల్చుతున్నారు. సినిమాను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మౌత్‌టాక్‌తో ఇది మరింత మందికి చేరువ అవుతుందని నమ్మకం ఉంది. కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలాంటి క్యూట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను ఆదరిస్తే ఇలాంటివి మరిన్ని చిత్రాలు వస్తాయి. ఈచిత్రంతో హీరో, హీరోయిన్లకు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది' అన్నారు.

హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన అందరూ నా నటన, డ్యాన్సుల గురించి ప్రశంసిస్తున్నారు. అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఈ రోజు ఫలితం చూస్తుంటే ఆ కష్టాన్ని మరిచిపోతున్నాం. వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం' అన్నారు. హీరోయిన్‌ తాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ.. ‘సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుండి చాలా పాజిటివ్‌ స్పందన వచ్చింది. ఓ మంచి చిత్రంలో హీరోయిన్‌గా నటించినందుకు సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌భాస్కర్‌‌కి థ్యాంక్స్' అన్నారు.

Advertisement

Next Story