Devara Update: ఎన్టీఆర్ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఫస్ట్ సాంగ్‌పై హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Hamsa |
Devara Update: ఎన్టీఆర్ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఫస్ట్ సాంగ్‌పై హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని కొరటాల శివ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దేవర చిత్రంతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. దేవర పార్ట్-1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అందరిలో భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చుట్టమల్లె చుట్టేసింది అనే సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా అత్యధికంగా వ్యూస్ సాధించింది. తాజాగా, దేవర అప్డేట్ ఇస్తూ కెమెరామెన్ రత్నవేలు ఒక్క పోస్ట్‌తో దేవరపై అంచనాలను రెట్టింపు చేశాడు. ‘‘ దేవర అదిరిపోయే ఫస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నాము.

అనిరుధ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. డ్యాన్స్‌లో తారక్ స్టైల్, గ్రేస్ అదిరిపోయేలా ఉంది. ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. డైరెక్టర్‌కు అభిమానులు బ్రహ్మరథం పడతారు. దీనికి గణేష్ ఆచార్య మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు’’ అని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా షూటింగ్ జరుగుతున్న ప్రదేశం నుంచి ఓ ఫొటోను విడుదల చేశారు. ఇక అది చూసిన ఫ్యాన్స్ ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story