- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘బేబి’ డైరెక్టర్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన దేత్తడి హారిక..
by Anjali |

X
దిశ, సినిమా: యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అవకాశం దక్కించుకుంది. తనదైన ఆటతీరుతో మెప్పించి టాప్ 5లో నిలిచి సత్తా చాటింది. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్ట్ లో మెయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తెరకెక్కుస్తుండగా.. ఇప్పటికే కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా అక్టోబర్ 30న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక కవర్ సాంగ్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హారిక.. హీరోయిన్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Next Story