Chandramukhi 2 : ట్రైలర్ రిలీజ్‍‍కు డేట్ ఫిక్స్

by Prasanna |   ( Updated:2023-09-03 06:07:02.0  )
Chandramukhi 2 :  ట్రైలర్ రిలీజ్‍‍కు డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: 2005లో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‍గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్, బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‍ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈవెంట్ గురించి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 3న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍ చెన్నైలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‍లో మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed