బుల్లితెరపై బాలయ్య మరో సెన్సేషన్.. 'అన్‌స్టాపబుల్-2' ఫస్ట్‌గా గెస్ట్‌గా చంద్రబాబు (వీడియో)

by GSrikanth |   ( Updated:2022-10-04 09:32:55.0  )
బుల్లితెరపై బాలయ్య మరో సెన్సేషన్.. అన్‌స్టాపబుల్-2 ఫస్ట్‌గా గెస్ట్‌గా చంద్రబాబు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న 'అన్‌స్టాపబుల్ షో' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరికొత్త అవతారంలో బాలయ్య బాబు బుల్లితెరపై అదరగొట్టారు. టాలీవుడ్ దిగ్గజాల రాకతో 'అన్‌స్టాపబుల్' మొదటి సీజన్ విజయవంతంగా పూర్తయింది. దీంతో అభిమానులందరూ సీజన్‌-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌-2లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ మరోసారి బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో 'అన్‌స్టాపబుల్ 2' నుంచి లీకైన కొన్ని వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ షో కు మొదటి గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయినట్లు తెలుస్తోంది. బాలయ్యతో కలిసి 'అన్‌స్టాపబుల్ -2' కు వేదికపైకి చంద్రబాబు అభిమానులకు అభివాదం చేస్తోన్న వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

జనసేనకు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

వీడియో కోసం కింది క్లిక్ చేయండి:
https://www.facebook.com/satyanarayana.koduri/videos/1338581526677224/

Advertisement

Next Story