- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor: అతని సలహా వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాన్సులు.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన జాన్వీ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ మూవీ విడుదల కాకుండానే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అంత క్రేజ్ సంపాదించుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. దేవర ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవ లేదు. అతి తక్కువ సమయంలోనే నేను మంచి పాత్రలు చేసి మెప్పించా. అయితే నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలనేది మా అమ్మ కోరిక. అది నెరవేర్చాలని సౌత్ సినిమా చేయాలనుకుంటున్న సమయంలోనే నాకు తెలుగులో ఆఫర్లు వచ్చాయి. అందులో ‘దేవర’ ఒకటి. అప్పుడే తమిళంలో కూడా ఓ సినిమా చాన్స్ వచ్చింది.
ఈ రెండింటిలో ఏది ఒకే చేయాలా అని తికమక పడుతున్న సమయంలో కరణ్‌జోహార్ నాకు ఓ సలహా ఇచ్చాడు. ముందు అయితే తారక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా మంచి ఆఫర్లు వస్తాయి అన్నాడు. ఆయన చెప్పినట్లుగానే చేశాను. ఆ సలహా నా కెరీర్‌కు బాగా కలిసొచ్చింది. దేవర విడుదల కాకుండానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చాన్స్ వచ్చింది. ఇంకా కొన్ని లైన్‌లో ఉన్నాయి. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది.
Read More....
Mrunal Thakur: మ్యూజికల్ లవ్‌స్టోరీతో రాబోతున్న మృణాల్ ఠాకూర్.. హీరో ఎవరంటే?