BRO OTT Release Date: పాన్ ఇండియా రేంజ్‌లో పవన్ మూవీ OTT Release

by sudharani |   ( Updated:2023-08-20 17:03:22.0  )
BRO OTT Release Date:  పాన్ ఇండియా రేంజ్‌లో పవన్  మూవీ OTT Release
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై-28న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే రాబట్టింది. ఇక.. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ డిజిటల్స్ రైట్స్‌‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆగస్టు-25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఇందులో మళయాల హీరోయిన్ ప్రియా ప్రకాశ్ హీరోయిన్, తెలుగు హీరోయిన్ కేతిక శర్మ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో కేవలం తెలుగులోనే విడుదల చేసిన చిత్ర యూనిట్ ఓటీటీలో మాత్రం మొత్తం ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ) రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :


బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భగవంత్ కేసరి అప్డేట్

పవన్ ‘గుడుంబా శంకర్’ రీరిలీజ్‌తో పాటుగా ‘OG’ నుంచి గ్లింప్స్.

Next Story