అమ్మ కోసమే అతని చెంప పగలగొట్టా: సంయుక్త మీనన్

by Anjali |   ( Updated:2023-04-25 11:45:00.0  )
అమ్మ కోసమే అతని చెంప పగలగొట్టా: సంయుక్త మీనన్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు సంపాదించుకున్న నటి సంయుక్త మీనన్. ‘విరూపాక్ష’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె.. తనకు జరిగిన ఒక సంఘటనను షేర్ చేసుకుంది. ‘నేను మా అమ్మతో కలిసి బయటకెళ్లినపుడు.. ఒకే చోట ఇద్దరం నిల్చున్నాం.

అంతలోనే ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ పొగ వదులుతున్నారు. అమ్మకు శ్వాసకోశ సమస్య ఉంది. అక్కడి నుండి పక్కకు వెళ్లే పరిస్థితి లేక అలాగే నిలబడిపోయాం. కానీ అతని కారణంగా అమ్మ చాలా ఇబ్బంది పడింది. దీంతో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘అమ్మకు సమస్య ఉంది ఆపండి’ అని రిక్వెస్ట్ చేశాను. ఆ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడాడు. కోపం వచ్చి లాగి చెంపపై ఒక్కటి ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

మగాళ్లకే కాదు.. మహిళల్లోనూ చాలా షేడ్స్ ఉంటాయి: తాహిరా

Advertisement

Next Story