ఆ విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బ్రహ్మానందం

by Anjali |
ఆ విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బ్రహ్మానందం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సినీ స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్న తర్వాత బ్రహ్మానందం వేదికపై మాట్లాడారు. ఆ సమయంలో కొంతమంది మొబైల్‌లో మాట్లాడుతూ ఆయనకు కనిపించారు. దీంతో అతడు కోపం వ్యక్తం చేస్తూ.. ‘‘తారక రామారావు లాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినాలి. దయచేసి సెల్‌ఫోన్లు చూడడం ఆపండి’’ అంటూ చేతులు జోడించి దండం పెట్టారు. అలాగే మాట్లాడొద్దంటే చెప్పండి, వెళ్లిపోతానంటూ మండిపడ్డారు.

Advertisement

Next Story