- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒళ్లు దగ్గరపెట్టుకుని.. చచ్చేంత వరకూ నవ్విస్తూనే ఉంటా
దిశ, సినిమా : టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తాను చచ్చిపోయేంత వరకూ నవ్విస్తూనే ఉంటానంటున్నాడు. ఆయన, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘రంగమార్తాండ’ మార్చి 22న విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ.. ‘బ్రహ్మీ స్ర్కీన్‌పై కనిపిస్తే నవ్వడమే కామన్ పాయింట్. నేను ఎన్ని సినిమాలు చేసినా నవ్వించడమే నా పని. ఆ పరిధి దాటి బయటకు రాకూడదు. వచ్చినా జనాలు యాక్సెప్ట్ చేయలేరు. ఇలాంటి సందర్భంలో కృష్ణ వంశీ, ప్రకాశ్ రాజ్ నా దగ్గరకు వచ్చి ఈ సినిమా పాత్ర గురించి చెప్పగానే షాక్ అయ్యాను. ఇదొక అరుదైన అవకాశంగానే ఫీల్ అయ్యాను. ఇందులో నా నటన చూసి ‘అన్నయ్య మీ నటనను అభినందించపోతే కళామాతల్లిని అవమానించినట్లే’ అని ప్రకాశ్ రాజ్ అన్నాడు. డైరెక్టర్‌కు చెడ్డ పేరు రాకూడదని ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశా. ఈ చిత్రం ఒక జీవితాన్ని చూసినట్లే ఉంటుంది’ అని తెలిపాడు.