Sri Devi చిరకాల కోరిక నెరవేర్చిన Boni Kapur.. ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-08-21 15:39:32.0  )
Sri Devi చిరకాల కోరిక నెరవేర్చిన Boni Kapur.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరీ శ్రీదేవి మరణించి చాలా కాలం అవుతున్నప్పటికీ.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా చిరస్మరణీయంగా ఉన్నారు. టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మొప్పించిన అతిలోక సుందరి.. ఊహించని స్థితిలో ఆకస్మిక మరణం చెందారు. తన ఫ్యామిలీతో పాటు, అభిమానులు సైతం శ్రీదేవి మరణాన్ని తట్టులేకపోయారు. ఇదిలా ఉంటే.. శ్రీదేవి చిరకాల కోరికను ఆమె భర్త బోణీ కపూర్ తాజాగా పూర్తి చేశారట. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

శ్రీదేవి కెరీర్‌లో మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆమె చెన్నైకి సమీపంలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో బీచ్ దగ్గర ఐదెరకాల స్థలాన్ని కోనుగోలు చేశారట. అక్కడ బీచ్ హౌస్‌లో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఎంతో ఆశపడిందట. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అయితే.. శ్రీదేవి కోరికను భర్త బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ తాజాగా నెరవేర్చారు. శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తాజ్‌ గ్రూప్‌ పార్ట్‌నర్‌షిప్‌లో హోటల్‌గా అభివృద్ధి చేశారు. దీని గురించి బోనీ కపూర్ మాట్లాడుతూ.. ‘‘ఇది శ్రీదేవి కల. శ్రీదేవి డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్‌ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్‌ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. దీనికి సంబంధించిన ట్వీట్, ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story