Janhvi Kapoor: తారక్‌తో ఒక్క చాన్స్ ఇవ్వమని దేవుడిని వేడుకున్నా: జాన్వీ కపూర్

by Prasanna |   ( Updated:2023-03-19 09:34:13.0  )
Janhvi Kapoor: తారక్‌తో ఒక్క చాన్స్ ఇవ్వమని దేవుడిని వేడుకున్నా: జాన్వీ కపూర్
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ మరోసారి ప్రశంసలు కురిపించింది. వీరిద్దరి కలయికలో '#NTR30' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఓ షోలో సౌత్ ఇండియా డెబ్యూ గురించి మాట్లాడిన నటి.. తారక్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం రావాలని బలంగా కోరుకున్నానని చెప్పింది. అంతేకాదు ఎన్నోసార్లు దేవుడిని కూడా ప్రార్థించానన్న బ్యూటీ.. ‘తారక్‌కి ఉన్న చరిష్మా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నా. డైరెక్టర్ కొరటాలగారికి రోజూ మెసేజ్ చేస్తున్నా. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అతని స్క్రీన్ ప్రజెన్స్‌ని ఎంజాయ్ చేయడం కోసం మళ్లీ మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ చూస్తున్నా. తారక్‌తో కలిసి నటించడం నా జీవితంలో ఒక గొప్ప మూమెంట్. నేనెప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తా. అందుకే నేను కోరుకున్నది జరుగుతోంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: అక్కినేని అఖిల్..

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story