‘బిగ్‌బాస్ 7’ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన Maadhavi Latha.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

by Hamsa |
‘బిగ్‌బాస్ 7’ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన Maadhavi Latha.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మాధవీలత ‘నచ్చావులే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరం అయి రాజకీయాల్లోకి వెళ్లింది. అయితే మరో రెండు నెలల్లో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కాబోతుంది. ఇందులో మాధవీలత పాల్గొంటుందని ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా, దీనిపై ఆ అమ్మడు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘‘ నా అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. బిగ్‌బాస్ 7 కోసం ఆ టీమ్ నన్ను సంప్రదించింది. ఇది తొలిసారి కాదు, ఇప్పటివరకు ఇలా మూడుసార్లు నాకు బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారు. కానీ, నేనే సున్నితంగా తిరస్కరించాను. నాకు బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఏ మాత్రం ఆసక్తి లేదు. నన్ను షోలో పాల్గొనాల్సిందిగా కోరిన బిగ్‌బాస్ టీమ్‌కు థాంక్యూ’’ అంటూ ఇస్టా‌గ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు కొందరు వెళ్లకుండా మంచి పని చేశారని అంటుంటే.. మరికొంత మంది ఒకసారి ట్రై చేయాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: అమెరికాలో ట్రీట్‌మెంట్ కోసం సమంత ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా!

Advertisement

Next Story

Most Viewed