BIG News: ‘కల్కీ’ మూవీ నిర్మాతలకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్ట్రీమ్ అవుతోన్న ఫుల్ మూవీ

by Shiva Kumar |
BIG News: ‘కల్కీ’ మూవీ నిర్మాతలకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్ట్రీమ్ అవుతోన్న ఫుల్ మూవీ
X

దిశ, వెబ్‌డెస్క్: సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన ‘కల్కీ’ మూవీ హిట్ టాక్‌ను అందుకుంది. నాగ్ అశ్విన్ అద్భుత డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీ సినీ వివర్శకులను సైతం ఎంతగానో ఆటకట్టుకుంటూ బాక్స్‌ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే మూవీ నిర్మాతలకు కొత్త తలనొప్పి మొదలైంది. తాము నిర్మించి మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోందనే సంతోషం కాసేపైన నిలవక ముందే ‘కల్కీ’ ఫుల్ మూవీ ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం వారిని షాక్ గురి చేస్తోంది. ఈ పరిణామంతో మూవీ టీంతో పాటు నిర్మాతలు, ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పైరసీ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ‘కల్కీ’ మూవీ మూవీరూల్స్‌‌తో పాటు పలు వెబ్‌సైట్లలో స్ట్రీమ్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story