Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ రన్‌‌ టైమ్ లాక్..

by Prasanna |   ( Updated:2023-09-23 07:20:07.0  )
Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ రన్‌‌ టైమ్ లాక్..
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, యంగ్ హీరోయిన్ శ్రీ లీల కీ రోల్ పోషిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 19న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక విడుదలకు సమయం దగ్గరగా పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లకు సిద్ధం అవుతోంది. ఈసారి ప్రమోషన్ ఈవెంట్స్ భారీగా చేయాలనుకుంటున్నారట. అంతే కాకుండా బాలయ్యతో స్పెషల్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సుమారు 2 గంటల 37 నిమిషాల రన్ టైమ్‌తో వచ్చిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.

Next Story

Most Viewed