- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్చరిక: సైలెంట్‌గా చంపేస్తున్న నడుము నొప్పి.. క్యాన్సర్‌కు సంకేతం!!
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఐదుగురిలో ముగ్గురు నడుము నొప్పితో బాధపడుతూనే ఉంటారు. చాలా సేపు వర్క్ చేయడం ఇందుకు కారణం అనుకుని ఊరుకుంటాం కానీ ఇది క్యాన్సర్‌కు సంకేతమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. లోయర్ బ్యాక్, పెల్విస్ లేదా అపెండిక్స్‌లో నిరంతరం నొప్పి 'గర్భాశయ క్యాన్సర్' లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
UK కు చెందిన ప్రముఖ స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ అయిన 'ఈవ్ అప్పీల్' ప్రకారం.. UKలో ప్రతి ఏటా 3,200 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 35 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో ఇది అత్యంత సాధారణమైపోయింది. అందుకే ప్రారంభ దశల్లోనే గర్భాశయ క్యాన్సర్‌ను నిర్ధారిస్తే దీని నుంచి బయటపడవచ్చని.. ఇందుకోసం గర్భాశయ స్క్రీనింగ్స్, స్మెర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కానీ UKలోని దాదాపు మూడోవంతు మంది మహిళలు స్మెర్ పరీక్ష చేసుకోకపోవడం మూలంగా ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
చూడవలసిన ఇతర ప్రారంభ సంకేతాలు ఏమిటి?
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఎప్పుడూ స్పష్టంగా ఉండవు. ఇది అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించకపోవచ్చు. పైగా కొంతమంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించిన ఎటువంటి సంకేతాలను అనుభవించరు. అందుకే సర్వైకల్ స్క్రీనింగ్ అపాయింట్‌మెంట్‌లన్నింటికీ హాజరుకావడం చాలా ముఖ్యం.
క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలు
1. అసాధారణ రక్తస్రావం
గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ సంకేతం క్రమరహిత రక్తస్రావం. గర్భాశయం క్రింద ఉన్న కణజాలంపై క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లోనూ ఇలా జరగడం ఆందోళనకరమైన సంకేతం. కాగా గర్భాశయ క్యాన్సర్ రావడానికి వయోపరిమితి లేదు.
2. అసాధారణ యోని ఉత్సర్గ
ప్రతి ఒక్కరి ఉత్సర్గ భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఏది సాధారణమో తెలుసుకునే సందర్భం. రంగు, వాసన, స్థిరత్వం మారినట్లు గుర్తించినట్లయితే కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్‌కు ఆక్సిజన్ లేనప్పుడు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది వింత వాసనతో కూడిన ఉత్సర్గకు దారితీస్తుంది.
3. సెక్స్ సమయంలో అసౌకర్యం, నొప్పి
సెక్స్ సమయంలో నొప్పి వివిధ సమస్యలకు సంకేతం కావచ్చు. కానీ ఇందులో ఒకటి గర్భాశయ క్యాన్సర్. కాగా క్యాన్సర్ చుట్టుపక్కల కణజాలాలకు వ్యాపిస్తోందనడానికి ఇది సంకేతం.
4. అనాలోచిత బరువు తగ్గడం
అప్రయత్నంగా బరువు తగ్గడం అనేది హ్యాపీగా అనిపించవచ్చు. కానీ కారణం లేకుండా జరిగితే మాత్రం మంచిది కాదు. ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం అనేది శరీరం సరిగ్గా పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. ఇది శక్తిని ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఇవి కూడా చదవండి : రేప్ సన్నివేశాలపై రవీనా టాండన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్