- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినాష్ భార్యతో సమానంగా బిగ్ బాస్ సోహైల్‌కు సీమంతం.. వైరలవుతోన్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: ‘జబర్దస్త్’ కమెడీ షోతో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ముక్కు అవినాష్. ఈ ఏడాది అనూజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అవినాష్ భార్య ప్రస్తుతం గర్భావతి. దీంతో అవినాష్.. భార్యకు సీమంత వేడుకను ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి బిగ్‌బాస్ సోహైల్ హాజరయ్యాడు. నాకు కూడా సీమంతం చేయాలని పట్టుపట్టాడు. అక్కడ అందరూ నవ్వుతూ మగాడికి సీమంతం ఏంట్రా బాబు.. వద్దురా అన్నా వినకుండా సోహైల్‌కు కూడా అనూజాతో సమానంగా సీమంతం చేశారు.
ఇక సోహైల్.. శ్రీనివాస్ దర్శకత్వంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ రోజు (ఆగస్టు 18) న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో రూప కథానాయికగా నటించింది. సుహాసిని, హర్ష, బ్రహ్మాజీ, అలీ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు పాజిటివ్ టాక్ నడుస్తోంది.