Shivam Bhaje Movie: ఆడియెన్స్‌కి ఈ కొత్త కాన్సెప్ట్ నచ్చుతుంది.. ‘శివం భజే’ ప్రెస్ మీట్‌లో అశ్విన్ బాబు

by Prasanna |
Shivam Bhaje Movie: ఆడియెన్స్‌కి ఈ కొత్త కాన్సెప్ట్ నచ్చుతుంది.. ‘శివం భజే’ ప్రెస్ మీట్‌లో అశ్విన్ బాబు
X

దిశ, సినిమా: యంగ్ హీరో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటిస్తున్న చిత్రం ‘శివం భజే’. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అప్సర్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఈ సినిమా ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ మూవీపై మంచి అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో అశ్విన్ బాబు మీడియాతో ముచ్చటించారు. ‘‘హిడింబ తర్వాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్ పాయింట్‌తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ ‘శివం భజే’ కథను విన్నాను. నాకు చాలా నచ్చింది. ఆడియెన్స్‌కి కూడా ఈ యూనిక్ పాయింట్, కొత్త కాన్సెప్ట్ నచ్చుతుందని భావిస్తున్నాను. రాజు గారి గది, హిడింబలా ఇందులోనూ కొత్త పాయింట్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఇందులో డివైన్ పాయింట్ ఉంటుంది. హిడింబలో కారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్ ఈ కథను రాసిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్‌గా, స్టైలీష్ యాక్షన్ చేశావ్ అన్నా అని మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అన్నారు. అది నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్. టీం అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్ పట్ల సంతృప్తి చెందారు. డైరెక్టర్‌ ఈ కథలో డివైన్ పాయింట్‌‌ను ఎలా కనెక్ట్ చేశారన్నదే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. ‘రాజు గారి గది 4 ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అన్నయ్య కథను రాస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి’ అని తెలిపారు.

Advertisement

Next Story