హైదరాబాద్ శివారులో వందల ఎకరాలు కొనుగోలు చేసిన ‘పుష్ప’ నిర్మాతలు!

by GSrikanth |   ( Updated:2023-04-20 11:55:06.0  )
హైదరాబాద్ శివారులో వందల ఎకరాలు కొనుగోలు చేసిన ‘పుష్ప’ నిర్మాతలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మైత్రీ మూవీస్ కార్యాలయంలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముంబై లింకులపై ఢిల్లీ ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ముంబైలోని ఓ ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకొని బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించాలనుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌తో డీల్ సైతం మాట్లాడుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీస్ వాళ్లు సినిమా ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమా విషయంలోనే భారీగా అడ్వాన్స్‌ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముంబైలోని ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు రెండ్రోజులుగా సోదాలు జరుపుతున్నారు. సినిమా డబ్బులతో హైదరాబాద్ శివారులో వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు.

Read More:

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో IT దాడులు.. వెలుగులోకి సంచలన విషయాలు

Advertisement

Next Story