కనీసం ఫొటో ఫ్లాష్‌ను తట్టుకోలేకపోతున్న సమంత.. సినిమా ఎలా తీస్తుంది?

by Aamani |   ( Updated:2023-06-28 07:07:36.0  )
కనీసం ఫొటో ఫ్లాష్‌ను తట్టుకోలేకపోతున్న సమంత.. సినిమా ఎలా తీస్తుంది?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రజెంట్ తను నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా సమంతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ‘శాకుంతలం’ త్రీడి ట్రైలర్‌ విడుదల కోసం సమంత ముంబైకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె బయటకు వస్తున్న క్రమంలో ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫొటోలు తీయడం కోసం ఎగబడ్డారు. కానీ, సమంత ఫొటో ఫ్లాష్‌లను తట్టుకోలేకపోయింది. ‘ప్లీజ్ నో ఫొటోస్’ అంటూ కళ్లు మూసుకుంది. ఇక ఈ వీడియోను బట్టి చూస్తే సమంత ఆరోగ్యం కుదుటపడలేదని అర్థం అవుతోంది. అయితే మూవీస్ అన్ని ఫుల్ లైటింగ్ మధ్య షూట్ చేస్తారు. మరి సమంత అది ఎలా తట్టుకుంటుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ‘ఏజెంట్’ సెట్‌లో అఖిల్‌తో సందడి చేసిన యాంకర్ సుమ

Advertisement

Next Story

Most Viewed