ఇది కూడా బ్రాండేరా.. డబుల్ ఇస్మార్ట్ నుంచి మరో సాంగ్ రిలీజ్..మాస్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్!

by Jakkula Samataha |
ఇది కూడా బ్రాండేరా.. డబుల్ ఇస్మార్ట్ నుంచి మరో సాంగ్ రిలీజ్..మాస్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : డబుల్ మాస్‌తో తన అభిమానులను సందడి చేయడానికి రెడీ అయ్యాడు యంగ్ హీరో రామ్ పోతినేని. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డుబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, మొదట సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు మూవీ విడుదల అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో మూవీ టీం సినిమా నుంచి రెండో పాటగా, మార్ ముంత చోడ్ చింత సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఊర మాస్‌లో ఉండటంతో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మచి మాస్ బీట్ ఇవ్వా, రాహుల్ సింప్లిగంజ్, కీర్తన శర్మ ఫుల్ జోష్‌తో సాంగ్‌ను సూపర్‌గా పాడారు. ఇక రామ్ ఈ పాటలో తన ఎక్స్ ప్రెషన్స్ డ్యాన్స్ తో ఇరగదీశాడు. ఇది కూడా బ్రాండేరా అంటూ.. మాస్ స్టెప్స్ వేస్తూ అదరగొట్టాడు. ఇక హీరోయిన్ కావ్య థార్ అందాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు గ్లామర్‌తో మాస్ స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకుంది. దీంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed