- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కొత్త సినిమా అప్డేట్.. ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్
దిశ, సినిమా: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. తన తొలి చిత్రం కలర్ ఫోటో తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టొరీ కోసం యంగ్ ట్యాలెంటెడ్ రోషన్ కనకాలతో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘మోగ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రోషన్ కనకాల యూనిక్ రోల్ లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రోషన్ కనకాల వెస్ట్ ధరించి, సాలిడ్ ఫిజిక్, దట్టమైన అడవిలో గుర్రంతో పాటు చిరునవ్వుతో కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది.
విజువల్ గా పోస్టర్ కట్టిపడేసింది. అయితే మోగ్లీని 2025 సమ్మర్ లో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కలర్ ఫోటో కు సక్సెస్ఫుల్ ఆల్బమ్ అందించిన కాల భైరవ సంగీతం సందిస్తున్నారు. బాహుబలి1 & 2,RRR వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి M, సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. కలర్ ఫోటో, మేజర్,అప్ కమింగ్ గూఢచారి 2 హిట్ చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. కాగా, యాంకర్ సుమ కొడుకు అయిన రోషన్ కనకాల బబుల్‌గమ్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా విజయం సాధించనప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది.