బిగ్ స్క్రీన్‌పై కనిపించడం నాకు నచ్చదు.. సుమ

by Prasanna |
బిగ్ స్క్రీన్‌పై కనిపించడం నాకు నచ్చదు.. సుమ
X

దిశ, సినిమా: యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు షో‌లతో పాటు.. వరుస మూవీ ఈవెంట్‌లతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ సినిమాల్లో నటించక పోవడానికి గల కారణాలు వెల్లడించింది. ‘నేను రెండు మూడు చిత్రాల్లో నటించాను. కానీ ఎందుకో సినిమాల్లో పెద్దగా సక్సెస్ అవలేకపోయా. నాకు బిగ్ స్క్రీన్‌పై కనిపించడం ఇష్టం లేదు. యాంకరింగ్ అంటేనే ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed