నేను ఓ ఆడదాన్నే.. అనసూయ షాకింగ్ కామెంట్స్ !

by Jakkula Samataha |   ( Updated:2024-02-13 13:21:05.0  )
నేను ఓ ఆడదాన్నే.. అనసూయ షాకింగ్ కామెంట్స్ !
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ , తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో కుర్రకారును మాయచేస్తుంటుంది. ఇక యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ..తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది.

పుష్ప సినిమాతో తన నటనతో అందరినీ మెప్పించిన ఈ నటి, ప్రస్తుతం రజాకార్ సినిమాలో నటించింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో అనసూయ చాలా బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఈ అమ్మడుకు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో.. ఆ క్యారెక్టర్ లో మీరు అంత ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి ..?”అంటూ ప్రశ్నించారు . దీనికి అనసూయ స్పందిస్తూ.. అది నా సినిమా, నాకే జరిగింది, మళ్లీ అది నిజంగా జరిగిన సంఘటన కాబట్టి నేను ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయి నటించాను, మరీ ముఖ్యంగా, నేను కూడా ఓ ఆడదాన్నే కాబట్టి , ఇలాంటివి ఎక్కడా జరగనివ్వకూడదనుకొని ఈ పాత్రలో నటించానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story