జనసేన తరపున ప్రచారం చేయడానికి నేను రెడీ.. యాంకర్ అనసూయ ప్రకటన

by GSrikanth |
జనసేన తరపున ప్రచారం చేయడానికి నేను రెడీ.. యాంకర్ అనసూయ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను కూడా దాదాపు పూర్తి చేశాయి. ఇక ప్రచారం, పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సినీ, స్పోర్ట్స్, బిజినెస్ రంగాల్లో రాణించి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వ్యక్తులతో ప్రచారం చేయించేలా ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాను వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ప్రకటించారు. తనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ.. పొలిటికల్ పార్టీల నుంచి ఎవరైనా పిలిస్తే వెళ్లి ప్రచారం చేస్తా అని అన్నారు. ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీ తరపున నిలబడతా అని వెల్లడించారు. జనసేన నేతలు తనను ప్రచారానికి పిలిస్తే కచ్చితంగా వెళ్తా అని చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూన ఈ వ్యాఖ్యలు చేశారు.




Advertisement
Next Story