Anasuya Bharadwaj : అతనితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. వైరలవుతోన్న బెడ్ రూమ్‌ ఫొటోస్!

by Javid Pasha |   ( Updated:2024-05-16 14:16:33.0  )
Anasuya Bharadwaj : అతనితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. వైరలవుతోన్న బెడ్ రూమ్‌ ఫొటోస్!
X

దిశ, సినిమా : తన అంద చందాలతో, చురుకైన మాటలతో స్మాల్‌ స్క్రీన్ షోలకే వన్నెతెచ్చిన అతికొద్ది మంది తెలుగు యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. ఫుల్ ఫేమ్ సంపాదించుకొని ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇటు చిన్ని తెరపై కనిపిస్తూనే, అటు వెండితెరపై కూడా మెరుస్తూ సత్తా చాటుతోంది. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఎక్కవే. ఎప్పటికప్పుడూ అప్డేట్స్, లేటెస్ట్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది.

మూవీస్ పరంగా చూస్తే ప్రజెంట్ అనసూయ చేతిలో మస్తు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప- 2’లోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ఇప్పటికే ఆమె తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్స్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ చేస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీకి వరుస అవకాశాలు దూసుకొస్తున్నాయి.

సినిమాలు, యాంకరింగ్ విషయాలు పక్కన పెడితే ప్రజెంట్ అనసూయ భరద్వాజ్‌కు సంబంధించిన కొన్ని బెడ్ రూమ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటూ తెగ రెచ్చిపోయింది. రక రకాల యాంగిల్స్‌లో ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మొహంలో ఫుల్ హ్యాపీనెస్ కూడా కనిపించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?, ఆమె బెడ్ రూమ్‌లో చేసిన పనేంటి అనే అనుమానం కలుగుతోంది కదూ! అతనెవరో కాదు, ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్. ఆమె చేసిన పనేంటంటే.. ఇటీవల ఆమె తన 39వ పుట్టిన రోజును భర్త, పిల్లలతో కలిసి తన బెడ్ రూమ్‌లో కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి మరి.

Advertisement

Next Story