- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నాగచైతన్యను నేను పెంచలేదు, అతను అలాంటి వ్యక్తి.. చైతూపై అమల షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగార్జున అమలను ప్రేమించి, రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి అఖిల్ జన్మించిన విషయం తెలిసిందే. అయితే మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మీ, నాగార్జునకు నాగచైతన్య జన్మించాడు.
అయితే నాగార్జునకు చైతూ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చైతూ నాగార్జున వద్దకు వచ్చి వెళ్తుండేవాడు.చైని హీరోగా కూడా నాగార్జునే పరిచయం చేశారు. అతని బాగోగులను కూడా చూసుకుంటాడు. ఇక అమల, నాగచైతన్య మధ్య బంధం ఎలా ఉంటుంది అంటే దీని గురించి ఎవరూ సరిగ్గా చెప్పలేరు. ఎందుకంటే వీరు కలిసి కనిపించింది చాలా తక్కువ. కానీ గతంలో అమల చైతూపై కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడుతూ.. చైతూ ఎక్కువగా వాళ్ల అమ్మదగ్గరే పెరిగాడు. అప్పుడప్పుడు హైదారాబాద్‌కు వచ్చేవాడు. చైతూని నేను పెంచలేదు. కానీ చైకి, అఖిల్‌కు మంచి బాండింగ్ ఉంటుంది. ఇద్దరు తమ తండ్రిలానే సినిమాలు తీసిన తర్వాత రిజల్ట్ ఏదైనా రెండు మూడు రోజుల్లోనే దాని నుంచి బయటపడతారు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా చై చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఆమె పేర్కొంది. దీంతో చాలా మంది అసలు చైతూ, అమలకు మధ్య మంచి రిలేషన్ ఉండదేమో, ఎందుకంటే ఆమె చై, అఖిల్ బాగుంటారు, నాన్నతో ఎక్కువగా ఉంటాడు అని చెప్పింది. కానీ తనతో చై రిలేషన్ గురించి ఎక్కడా చెప్పలేదు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ లేదేమో అని ముచ్చటిస్తున్నారు. అప్పటి వార్త ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.