స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-10-10 15:39:23.0  )
స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహారెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరు 2011లో పెళ్లి చేసుకున్నారు. స్నేహ పిల్లలను చూసుకుంటూనే బిజినెస్‌లు కూడా చూసుకుంటుంది. ఇక అల్లు అర్జున్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా కానీ, పిల్లలతో వేకేషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

తాజాగా, సెప్టెంబర్ 29న తన భార్య స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. అంతేకాకుండా ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ.. సన్‌సైన్ ఆఫ్ మై లైఫ్’ అని క్యాప్షన్ కూడా జత చేశాడు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా పలు యాడ్ చేస్తూ భారీగా రెమ్యనరేషన్ అందుకుంటున్నాడు.

Advertisement

Next Story