- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటి పేరు బచ్చల.. చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్.. అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ సినిమా పోస్టర్ రిలీజ్

దిశ, సినిమా: టాలీవుడ్ అల్లరోడు ఇటీవల ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ మే 3న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, అల్లరి నరేష్ 62వ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదలైంది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి ‘బచ్చల మల్లి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే దీనికి సుబ్బు వంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ జత చేశారు. ‘‘పేరు - మల్లి. ఇంటి పేరు - బచ్చల. చేసేది - ట్రాక్టర్ డ్రైవింగ్. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు’’ అని రాసుకొచ్చారు. అలాగే షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కానున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. జాతర జరుగుతుండగా.. రిక్షాపై కూర్చొని బీడీ తాగుతూ కోపంగా చూస్తున్నట్లు కనిపించాడు.