కుక్క మీదనా మీ ప్రతాపం.. ఏం సైకోగాళ్లు ఉన్నారురా బాబు.. అలియా భట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Dishafeatures3 |
కుక్క మీదనా మీ ప్రతాపం.. ఏం సైకోగాళ్లు    ఉన్నారురా బాబు.. అలియా భట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. భర్త, కూతురితో కలిసి పార్టీలకు అటెండ్ అవుతూనే.. కెరీర్ లో కూడా దూసుకుపోతుంది. బాలీవుడ్ ను ఏలుతూనే.. హాలివుడ్ ఆఫర్స్ అందుకుంటుంది. సూపర్ స్టార్స్, యంగ్ స్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే.. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించిన సైకోలకు తగిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తుంది బ్యూటీ. ఇదే విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కోరుతుంది.

ఆరు నెలల కుక్క పిల్లను యజమాని లేనప్పుడు కేర్ టేకర్ ఎంత ఘోరంగా హింసిస్తుందనే విషయాన్ని గురించి వివరిస్తూ నటి సోఫీ చౌదరి పోస్ట్ పెట్టింది. ఓనర్స్ కు మ్యాటర్ చెప్పానని.. ఆ వ్యక్తిని పని నుంచి తీసేశారని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన అలియా ఎమోషనల్ అయిపోయింది. తమ ఫ్రస్ట్రేషన్ పెట్ యానిమల్స్ పై చూపే ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి జరగాలంటే.. డైరెక్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఇలాంటి ఘటనలు ఎక్కడ కనిపించినా దయ చేసి రియాక్ట్ కావాలని అభిమానులకు సూచించింది. రెస్పాన్సిబుల్ సిటిజన్ గా సోఫీ చేసిన పనికి ఖుడోస్ చెప్పింది.

Next Story

Most Viewed