అక్కినేని అఖిల్-జైనబ్ పెళ్లి వేదిక ఖరారు.. ఆ స్పెషల్ ప్లేస్‌లోనే ఒక్కటి కాబోతున్నారా?

by Hamsa |
అక్కినేని అఖిల్-జైనబ్ పెళ్లి వేదిక ఖరారు.. ఆ స్పెషల్ ప్లేస్‌లోనే ఒక్కటి కాబోతున్నారా?
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్(Akhil) ‘ఏజెంట్’ తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖిల్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు నాగార్జున(Nagarjuna) వెల్లడించారు. జైనబ్ రవడ్జీ‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. దీంతో అఖిల్ వివాహం ఎప్పుడు జరగుతుంది ఏంటీ అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరుగుతుంది. అయితే మార్చి 24న అఖిల్ పెళ్లి జరగబోతుందని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్.

అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఆ పెళ్లి ఎక్కడ ఏ ప్లేస్‌లో జరగనుందో అని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అఖిల్ తన అన్నయ్య నాగచైతన్య లాగా ఇండియాలో చేసుకుంటారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? అనే దానిపై ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, అఖిల్ పెళ్లి వేదిక ఖారారు అయినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అఖిల్ తన అన్న, వదిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన పెళ్లిని కూడా అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లోనే చేసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు గ్రేట్ అని అంటున్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని ఫ్యామిలీకి సెంటిమెంట్ ప్లేస్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు నాగార్జున ఈ విషయాన్ని తెలిపారు. కాబట్టి అఖిల్ నిర్ణయాన్ని కాదనలేకపోయారు కావచ్చు అని అంతా అనుకుంటున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed