Akhil Akkineni అభిమానులకు నిరాశ కలిగిస్తున్న 'ఏజెంట్'

by sudharani |   ( Updated:2022-11-27 06:36:02.0  )
Akhil Akkineni అభిమానులకు నిరాశ కలిగిస్తున్న ఏజెంట్
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నా భారీ బడ్జెట్ చిత్రాల్లో 'ఏజెంట్' ఒకటి. సురెందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని భావించినా.. టీజర్‌ మాత్రమే రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయిన చిత్ర బృందం వాయిదాల మీద వాయిదా వేస్తోంది. అయితే థియేటర్ల సమస్య కారణంగానే 'ఏజెంట్' వెనక్కి తగ్గినట్లు తెలుస్తుండగా 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి', 'వారసుడు', 'తునివు' వంటి సినిమాలకు పోటీగా అఖిల్ నిలవలేడనే టాక్ కూడా వినబడుతోంది. దీంతో 2023 సంక్రాంతికి కూడా విడుదలయ్యేలా కనిపించట్లేదు.

Advertisement

Next Story