- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి పూర్ణతో ఎఫైర్.. అసలు నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ నటుడు రవిబాబు
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొందరు ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. వరుసగా రెండు, మూడు మూవీస్ చేస్తే చాలు వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తుందనే పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే టాలీవుడ్ నటుడు, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిబాబుకు కూడా నటి పూర్ణతో ఎఫైర్ ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందుకే వరుసగా సినిమాలు చేసారనే వాదన కూడా ఉంది. దీనిపై వీరిద్దరు స్పందించినప్పటికీ ఎఫైర్ వార్తలు ఆగడం లేదు.
ఈ క్రమంలో.. తాజాగా, రష్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూర్ణతో ఎఫైర్‌పై క్లారిటీ ఇచ్చాడు రవిబాబు. ‘‘పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్లే ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. దాన్నే మీడియా పదే పదే స్ప్రెడ్ చేస్తోంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను మాత్రం కథకి, పాత్రకి డిమాండ్ చేస్తే అదే తీసుకుంటాను. అవును సినిమాలో ఆ పాత్రకి పూర్ణ సెట్ అవుతుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను.
ఆమె హార్డ్ వర్కర్, పనితనం నచ్చింది కాబట్టి వరుస సినిమాల్లో తీసుకున్నా. ఆమె ఎక్కడో కేరళలో ఉంటుంది. ఈ లింక్ ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయడం వల్లే వచ్చింది. పూర్ణ విషయంలో నేను ఆల్వేస్ ఆ పాత్రకి ఆమె సూట్ అవుతుందా లేదా అనేదాన్ని బట్టే ఎంపిక చేశాను. నేను ఎప్పుడు ఆమెకి క్యారెక్టర్ ఇచ్చినా 100శాతం న్యాయం చేస్తుంది. టెర్రిఫిక్ పర్ఫార్మర్. వన్ మోర్ అడగడానికి నేనే భయపడతాను. అంతటి డెడికేషన్‌తో, కాన్‌సన్‌ట్రేషన్‌తో షాట్ ఇస్తుంది. అందుకే ఆమెని అన్ని సార్లు తీసుకున్నాను. అంతేకానీ బయట ప్రచారం చేస్తున్నందుకు కాదు. రష్ సినిమాలో కూడా తీసుకుందామనుకున్నాను. కానీ ఆమెకు ఫైట్ చేయడం రాదు. పూర్ణ మంచి డాన్సర్ కానీ ఫైట్లు చేయలేదు అందుకే తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు.