ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసిన స్టార్ హీరో ఫ్యాన్స్.. బూతు వీడియోలతో హెరాస్ చేస్తున్నారని మహిళ కంప్లైంట్

by Disha Web Desk 7 |
ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసిన స్టార్ హీరో ఫ్యాన్స్.. బూతు వీడియోలతో హెరాస్ చేస్తున్నారని మహిళ కంప్లైంట్
X

దిశ, సినిమా: ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ కేసులు ఎక్కువై పోతున్నాయి. ఈ పద్ధతిని ఎక్కువ మంది బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేక కొంత మంది ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అయితే ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసింది సైబర్ నేరగాళ్లు కాదు.. ఓ స్టార్ హీరో ఫ్యాన్స్. అసలు విషయం లోకి వెళితే..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ‘రామాయణ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హోమ్లీ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే.. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్క అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాకపోవడం విశేషం. కానీ షూటింగ్ మాత్రం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సెట్ నుంచి కొన్ని ఫొటోలు లీకై నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు.

అయితే.. ఆ ఫొటోలు చూసి ఓ మహిళ రణ్‌బీర్ లుక్ బాగోలేదంటూ కామెంట్ చేసిందట. దీంతో రణ్‌బీర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయినట్లు తెలుస్తుండగా.. మా హీరో లుక్‌నే బాగోలేదు అని చెప్పేంత గొప్పదానివా అంటూ ఆమెమై సోషల్ మీడియా వేదికగా వేధింపులకు దిగినట్లు సమాచారం. అంతే కాకుండా రణ్‌బీర్ అభిమానులుగా చెప్పుకునే కొందరూ ఆ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆమె ఆ బాధను తట్టుకోలేక.. మధ్యప్రదేశ్ స్టేట్ సైబర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఆన్‌లైన్ బుల్లీయింగ్ మీద కంప్లైంట్ చేసినట్లు తెలిపింది. అంతే కాకుండా తన ఫొటోలు, వీడియోలుని మార్ఫింగ్ చేసి తనను హెరాస్ చేస్తున్నారని, ఎడిటింగ్ చేసిన ఫొటోలు, బూతు వీడియోలతో తనను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారవని రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఇష్యూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed