రియల్ స్టంట్‌తో నెటిజన్లకు షాక్ ఇచ్చిన తాప్సీ.. తెగ వైరల్ అవుతున్న వీడియో

by sudharani |   ( Updated:2023-09-09 14:02:48.0  )
రియల్ స్టంట్‌తో నెటిజన్లకు షాక్ ఇచ్చిన తాప్సీ.. తెగ వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: స్టార్ నటి తాప్సీ చేసిన ఓ ఫన్నీ స్టంట్‌ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇటీవల వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆమె ఏ మాత్రం ఫ్రీ టైమ్ దొరికినా వెకేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో తన కజిన్స్‌తో సరదాగా గడిపిన నటి.. గోడకు బల్లీలా అతుక్కుపోయే సర్కస్ స్టంట్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి అభిమానులను అలరించింది.

ఈ మేరకు తను ఉండే ఫ్లాట్ ముందు వరండాలో ఒక అమ్మాయిని జంతువుల బెండ్ చేసి మరొక అమ్మాయిని తన వీపు వీపుపైకి ఎక్కించింది. ఆ తర్వాత పైకి ఎక్కిన అమ్మాయి మోకాళ్లను గోడకు బలంగా అదిమి పట్టిన తాప్సీ కింద వంగివున్న అమ్మాయిని పక్కకు తప్పించింది. చూడటానికి ఈ సన్నివేశం సరదాగా కనిపించిన మిస్ అయితే మాత్రం కాళ్లు, నడుము విరిగిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా ‘స్పైడర్ ఆన్ వాల్. తాప్సీ చాలా బలమైనది’ అంటూ ఆమె ఎనర్జీని పొగిడేస్తున్నారు. అలాగే ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. తేడా వస్తే వెన్నెముక తీవ్రంగా దెబ్బతింటుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story