నాకు అది నచ్చితే చాలు.. డైరెక్టర్ బ్యాగ్రౌండ్ పట్టించుకోను: Ravi Teja

by sudharani |   ( Updated:2022-12-23 10:20:44.0  )
నాకు అది నచ్చితే చాలు.. డైరెక్టర్ బ్యాగ్రౌండ్ పట్టించుకోను: Ravi Teja
X

దిశ, సినిమా: మాస్ హీరో రవితేజ, త్రినాథ‌రావు నక్కిన కలయికలో వచ్చిన తాజా మూవీ 'ధమాకా'. యాక్షన్ ఎంటర్టైనర్‌గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. కాగా ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రవితేజ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'హిట్ లేదా ప్లాప్ ఆధారంగా ఒక దర్శకుడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. నాకు కథ నచ్చితే చాలు.. సినిమా తీసేస్తాం. పాత చిత్రాల ఫలితాలను పెద్దగా పరిగణలోకి తీసుకోను. ఒక్కసారి కథ లాక్ అయితే చాలు. మల్లి నేను అందులో జోక్యం చేసుకోను. ఒక వేల ఛాన్స్ ఏదైనా దొరికితే మాత్రం స్క్రిప్ట్‌లో సలహాలు ఇస్తా' అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed