హలో మేడం వాళ్ళు కూడా మనుషులే.. నటిపై ఫ్యాన్స్ ఫైర్

by Shyam |   ( Updated:2023-10-10 15:54:34.0  )
mouniroy
X

దిశ, సినిమా: సినిమా సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి ఒంటిరిగా వెళితే ఎంతో అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా హీరోయిన్లనైతే ఫ్యాన్స్ నానా ఇబ్బందులకు గురిచేస్తారు. తాజాగా ఇలాంటి అనుభవమే బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్‌కు ఎదురవగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల జుహులోని రికార్డింగ్ స్టూడియో నుండి మౌని బయటకు రాగానే సెల్ఫీల కోసం దూసుకొచ్చిన ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె బాడీని తాకేందుకు ప్రయత్నిస్తున్నాడనుకున్న నటి వెంటనే ఉలిక్కిపడి ‘అరెయ్’ అంటూ అరవడం చూడొచ్చు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది మౌనికి మద్ధతుగా నిలుస్తూ.. ‘సెలబ్రిటీలు అసౌకర్యానికి గురి కాకుండా కొంత డిస్టెన్స్ పాటించాలి’ అంటే.. మరికొందరు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ.. ‘ప్లీజ్ ప్లీజ్ మేడం వాళ్లు కూడా మానవులే. జంతువులు కాదు’ అని నెగెటీవ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగివున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed